![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -421 లో... కావ్య, రాజ్ లకి అపర్ణ విడాకులు ఇస్తాను అనడంతో.. అందరు అపర్ణకి ఎదరు తిరుగుతారు. మీరు ఆ మాయకి న్యాయం చేస్తానంటున్నారు కదా.. ఏ న్యాయస్థానం ఇవ్వని తీర్పు మీరు ఇస్తారా అంటూ కావ్య తన బాధని చెప్పుకుంటుంది. మీరేం చేసినా సరే నేను నా భర్తకి విడాకులు ఇవ్వనని కావ్య తన నిర్ణయం చెప్పగానే.. శభాష్ మనవరలా అదీ ధైర్యం అంటే అంటూ ఇందిరాదేవి కావ్యకి సపోర్ట్ గా ఉంటుంది.
రాజ్ నీకు విడాకులు ఇష్టమేనా అని ఇందిరాదేవి అడుగగా.. నాకు మాట్లాడే అర్హత లేదు.. నేనేం నిర్ణయం తీసుకోలేనని చెప్పేసి రాజ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అపర్ణ ఒంటరిగా బయట ఆలోచిస్తుంటుంది. అప్పుడే ఇందిరాదేవి తన దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఒక్కదానివేం చేస్తున్నావ్? నీకు కోడలిగా బాధ్యతలు ఇచ్చింది ఇంటికి పెద్ద కోడలని కాదు అందరిని సమానంగా చూస్తావని అంతే కానీ ఇలా చేస్తావని కాదు.. ఇప్పటికైనా కావ్యకి రాజ్ విడాకులు ఇవ్వాలని అనే ఆలోచన మార్చుకోమని ఇందిరాదేవి చెప్తుంది. మరి మీరు ఎలా న్యాయం చేస్తారని అపర్ణ అడుగుతుంది. నేనైతే కావ్యకి మాత్రమే న్యాయం చేస్తాను. నువ్వు కావ్యకి అన్యాయం చేస్తే అడ్డుపడేవారిలో నేనే ముందుంటాను గుర్తుపెట్టుకోమని అపర్ణకి ఇందిరాదేవీ వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు మాయ రుద్రాణిలు మాట్లాడుకుంటారు. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందని మాయ అంటుంది. ఇది కుడా మన మంచికేనని ఇప్పుడు అపర్ణ వదినని రెచ్చగొట్టి విడాకులు ఇప్పించేలా చెయ్యొచ్చని రుద్రాణి అంటుంది.
ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటుంటే స్వప్న వచ్చి.. ఒకే గూటికి చెందిన పక్షులు ఒక దగ్గర చేరడమంటే ఇదేనేమోనని స్వప్న అంటుంది. నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని చేసుకోమని రుద్రాణి అంటుంది. కావ్య గదిలోకి వెళ్ళగానే.. థాంక్స్ విడాకులు వద్దని చెప్పినందుకని రాజ్ అంటాడు. అంటే విడాకులు ఇస్తానని భయపడ్డారా అని కావ్య అంటుంది. మరి మీరెందుకు సైలెంట్ గా వచ్చారు.. అంటే నేనంటే ఇష్టం ఉందా అని కావ్య అంటుంది. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. తరువాయి భాగంలో అదే నిర్ణయం మీద ఉన్నావా అని కావ్యని అపర్ణ అడుగగా.. నిర్ణయం మార్చుకోవడానికి ఇది వ్యాపారం కాదని కావ్య అంటుంది. అయితే నా కొడుకు మాయని పెళ్లిచేసుకోవడం ఇష్టమేనని.. ఈ నో అబ్జెక్షన్ ఫామ్ పై సంతకం పెట్టమని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |